ఇందిరమ్మ ఇంటి పనులకు మంత్రి భూమిపూజ.. క్యాతన పల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం

ఇందిరమ్మ ఇంటి పనులకు మంత్రి భూమిపూజ.. క్యాతన పల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అమరవాది గ్రామంలో కాంగ్రెస్​పార్టీ  గ్రామ ఆఫీస్​ను రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​వెంకట స్వామి ప్రారంభించారు. ఆదివారం మంత్రి చేతుల మీదుగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేపట్టారు. అమరవాదిలో ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి భూమి పూజ చేశారు. 

అంతకు ముందు క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 8,9వార్డుల్లో రూ.13లక్షలు,5వ వార్డులో రూ.50 లక్షలు,14వ వార్డులో రూ.24 లక్షలు,15వ వార్డులో రూ.31లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. రూ.2.09 కోట్లతో కుర్మపల్లి చెరువు పరిసరాల్లో సుందరీకరణ, 8,9 వార్డుల పరిధిలోని శ్రీనివాస్ గార్డెన్స్​ నుంచి ఎంఎన్ఆర్​నేషనల్ హైవే వరకు రూ.1.80 కోట్లతో సెంట్రల్​లైటింగ్​, 5 వార్డులో రూ.27 లక్షలు, మందమర్రి మున్సిపాలిటీలోని ఊరుమందమర్రి మినీట్యాంక్​ బండ్​ వద్ద రూ.2.31 కోట్ల నిధులతో సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మందమర్రికి చెందిన సొతుకు ఉదయ్​కుమార్​ను మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట కలెక్టర్​కుమార్​ దీపక్, బెల్లంపల్లి ఎసీపీ కిరణ్​కుమార్, సీఐ పర్స రమేశ్, డీసీసీ ప్రెసిడెంట్​రఘునాథ్​రెడ్డి, మున్సిపల్​కౌన్సిలర్లు గోపతి భాగ్యరాజయ్య, దాముక శిరీష, భీమ మల్లేశ్, గుర్రం శ్రీనివాస్, కూతురు ప్రభాకర్, కాంగ్రెస్ రాష్ట్ర లీడర్ బండి సదానందంయాదవ్, టౌన్​ప్రెసిడెంట్ పల్లెరాజు, లీడర్లు పుల్లూరి కల్యాణ్, ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, పుల్లూరి లక్ష్మణ్​తదితరులు పాల్గొన్నారు.